కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కుంతీదేవి జాతరలో ఘర్షణ చెలరేగింది. వేల్ల గ్రామంలో కుంతీదేవి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన గారడీ ప్రదర్శకుల మధ్య ఈ వివాదం రేగడం తో రాయవరం మండలం మాచవరం గ్రామం చెందిన గారడీ ప్రదర్శకులు కపిలేశ్వరం మండలం వెదురుమూడి గ్రామ ప్రదర్శకులు ఒకరిపై ఒకరు గారడీ కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారికి స్థానికంగా వెల్ల ఆసుపత్రులోను. రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.